GI Tag: సిక్కింనుంచి తొలి డల్లె మిర్చి లార్జ్ ఎగుమతి 5 d ago

భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సిక్కిం నుండి సోలమన్ దీవులకు GI-ట్యాగ్ పొందిన 15,000 కేజీల డల్లె మిర్చిని తొలిసారిగా ఎగుమతి చేసింది. దీంతో ప్రపంచ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రీమియం ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతుంది.దీనిని పండించే రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే, సిక్కిం రాష్ట్రంలో పండించే డల్లె మిర్చికి మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఇతర సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది.
వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ నేతృత్వంలోని మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్ మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ పథకం కింద భారత ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా సేంద్రీయ డల్లె చిల్లీని సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే, అంతర్జాతీయ మార్కెట్లలో దీని విలువను మరితంగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. సిక్కిం వ్యవసాయ శాఖ మరియు గౌహతిలోని ప్రాంతీయ కార్యాలయంతో కలసి డల్లె చిల్లీ ఎగుమతులను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించింది. స్థానిక రైతులు మరియు ఫార్మర్ ప్రొడ్యూజర్ ఆర్గనైజేషన్స్ ప్రపంచ మార్కెట్ లో ప్రయోజనం పొందేలా అవకాశాలను సృష్టిస్తుంది.
ఇది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండి చాలా ఘాటుగా ఉంటుంది. అలాగే, ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. విటమిన్లు A, C మరియు E, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో స్కోవిల్లే హీట్ యూనిట్లు 100,000 నుండి 350,000 వరకు ఉంటాయి. దీనిని ఎక్కువగా వంటకాల్లో మసాలా దినుసుగా మరియు సంప్రదాయ ఔషధాల్లో వాడుతున్నారు. 2020లో, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం, సిక్కింలో పండించే ప్రత్యేకమైన మరియు అత్యంత ఘాటైన రకం డల్లె మిర్చికి GI ట్యాగ్ను ఇచ్చింది.